కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, కుమార్తెను కిరాతకంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తీవ్ర విషాదం నింపింది. భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. భార్య రమ, కుమార్తె ఆమనికి... తీవ్ర గాయాలు కావటంతో ప్రాణాలు విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి చంపాడు - హుజూర్‌నగర్‌లో హత్య భార్యా, కుమార్తెను హత్య చేసిన వ్యక్తి
చిన్న చిన్న గొడవలే కొన్నిసార్లు కుటుంబంలో పెను విషాదం నింపుతాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయే వాటికి కట్టలు తప్పిన ఆగ్రహం.. హత్యకు ఉసుగొల్పుతుంది. కన్న బంధాన్ని... కట్టుకున్న బాంధవ్యాన్ని తెంచేస్తుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో కొందరు కాటికి చేరుతుంటే... నేరం చేసిన వాళ్లు జైలుకు పోతున్నారు. ఈ క్రమంలోనే భార్య , కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది.
tg