విశాఖ జిల్లా అక్కయ్యపాలెం రామచంద్రనగర్లో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన యువకుణ్ని కుటుంబ సభ్యులే కొట్టి చంపారు. నగరానికి చెందిన అశోక్ వర్మ అనే యువకుడు మద్యానికి బానిసై.. నిత్యం కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేసేవాడు. శనివారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తల్లి వరలక్ష్మి, అక్క శ్రీదేవి, బావ వెంకటేశ్వరరాజు.. అశోక్ వర్మపై దాడి చేశారు. తలపై గట్టిగా మోదడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యానికి బానిసై కుటుంబసభ్యులకు వేధింపులు.. యువకుని హత్య - family members killed young man in visakhapatnam news
మద్యానికి బానిసై కుటుంబసభ్యులకు వేధింపులు.. యువకుని హత్య
08:06 July 12
వ్యక్తిని హత్య
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అశోక్ వర్మను తామే కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..
Last Updated : Jul 12, 2020, 9:54 AM IST