తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు...ఇంకా తానే సీఎం అనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కరోనా విపత్కర సమయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని..ఇలాంటి విధానాలు సరికావని అభిప్రాయపడ్డారు. ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రూ. 20కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాదిరిగానే ఆయన కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
'భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రూ.20కోట్లకు అమ్ముడుపోయారు' - coronavirus news in andhra
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రూ.20కోట్లకు అమ్ముడుపోయారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో మంత్రి అవంతితో కలిసి మాట్లాడిన ఆయన...కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ycp mp vijayasai reddy