ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓట్ల కోసం పాకులాట.. కూరగాయలు ఇచ్చి ప్రచారం - కూరగాయలు ఇచ్చి ఓట్లు అడుగుతున్న వైకాపా నేతలు

"ఒరే... ఒరే ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఇక్కడ మూడు సంచులివ్వాలి. ఇక్కడొక్కట్రారా... ఆ కూరగాయల సంచి తీసుకో... మర్చిపోవద్దు మన గుర్తు సీలింగ్ ఫ్యాన్​. ఈ గుర్తుకే ఓటు వేయ్యాలి. " ఈ మాటలు వింటే ఎక్కడో ఎన్నికలు కోసం ఓ పార్టీ కార్యకర్తలు కుస్తీ పడుతున్నట్లు ఉంది కదా..!. కానీ ఎక్కడో కాదండి. కరోనా ప్రభావిత జిల్లాల్లో ఒకటైన విశాఖలో. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు పంపిణీచేస్తుంటే.. ఇదే అదునుగా మార్చుకున్నారు రాజకీయ చతురులు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకే ఓట్లు వేయ్యాలని సంచుల్లో కూరగాయలు పంచిపెడుతూ సరిలేరు...మాకెవ్వరూ ఈ రాజకీయ క్రీడల్లో అని నిరూపించుకున్నారు.

ycp leaders campaign for local elections in corona time
ఓట్ల కోసం పాకులాట.. కూరగాయలు ఇచ్చి ప్రచారం

By

Published : Apr 2, 2020, 9:05 PM IST

ఓట్ల కోసం పాకులాట.. కూరగాయలు ఇచ్చి ప్రచారం

కరోనా నివారణ చర్యల్లో కేంద్రం ప్రకటించిన లాక్​డౌన్​తో నివాసాలకే పరిమితమైన వారికి ఇళ్ల వద్దే సాయమందించేందుకు పలు రాజకీయ కార్యకర్తలు నేతలు ముందుకు వస్తున్నారు. విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలో సేవాభావంతో ఈ తరహా సహాయం అందిస్తున్న వారిని అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు నేతలు గుంపులు గుంపులుగా వెళ్లి సాయాన్ని అందిస్తూనే తమకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటెయ్యాలని ప్రచారం చేయడం అందరినీ విస్మయపరుస్తుంది. ఈ చర్యలకు అడ్డుకట్ట వెయ్యకపోతే కరోనా ప్రబలేందుకు ఇదో కారణం అయ్యే ప్రమాదముందని స్థానికుల ఆందోళన వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details