ఆడితే... ఆన్‌లైన్ ఆటలే ఆడాలి బాబు! - online games
విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్ ఆడితే...తల్లిదండ్రులకు చిర్రెత్తుకోస్తుంది. సమయం వృథా చేస్తున్నారని మహా కోపం. అదే మెుబైల్, ఆన్లైన్లో ఆటల ఆడితే...విజ్ఞానం వస్తుందంటే...ఎందుకు కాదంటారు! విశాఖలో కొంతమంది యువత చేసిన ఆలోచన ఇదే. వేటితో ఆరోగ్యం, సమయం వృథా అవుతుందని అనుకుంటున్నారో...వాటితో విజ్ఞానం పొందేలా ఆటలు రూపొందించారు.
ఆడితే... e-ఆటలే ఆడాలి బాబు!
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లలు చరవాణి ఆటలతో సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇదే ప్రధాన అంశంగా తీసుకుని ఏ చరవాణి ఆటలు విద్యార్థులను హరిస్తున్నాయో అదే చరవాణి, అంతర్జాల ఆటల ద్వారా వారికి విద్యా విజ్ఞానం, వినోదం, పాఠాలు నేర్పే ప్రయత్నం చేశారు విశాఖకు చెందిన యువత. విస్డమ్ వీల్ పేరిట ఓ ప్రాజెక్టు రూపొందించారు. పెద్ద వాల్తేరులో సాధన అకాడమీ పేరుతో గేమ్ హబ్ ప్రారంభించారు. చిన్న వయసు వారి నుంచి పీజీ విద్యార్థుల వరకు ఈ ఆటలు ఆడుకోవచ్చు.