ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రత్యేక శిక్షణ - mock counting
ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎం నిర్వహణ, వీవీప్యాట్ల లెక్కింపుపై అధికారులకు విశాఖలో అవగాహన కల్పించారు. సబ్ కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఓట్ల లెక్కింపు అధికారులకు శిక్షణ కార్యక్రమం
ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం.. విశాఖలో ముమ్మర కసరత్తు సాగుతోంది. ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద ఓట్లు లెక్కించే విధానం, వీవీ ప్యాట్ల లెక్కింపు, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు. మాక్ ఈవీఎం, వీవీప్యాట్లతో సిబ్బందికి అవగాహన కల్పించారు.