విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు పలికినందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.. మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను ఆ కమిటీ ప్రతినిధులు కలిశారు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన కర్మాగారాన్ని సందర్శించాలని మంత్రిని కోరారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తే ఏపీ విషయాలు నీకెందుకని అంటున్నారని తెలిపారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారని ప్రశ్నించారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలమని ఆయన అన్నారు.