విశాఖ దుర్ఘటనకు నూటికి నూరు శాతం ఎల్జీ పాలిమర్స్ సంస్థ వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకే కమిటీలు వేశామని అన్నారు. అంతేకానీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పి సంస్థ చేతులు దులుపుకుంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అలాగే బాధితులకు పరిహారాన్ని సంస్థ ముక్కుపిండి వసూలు చేస్తామని స్ఫష్టం చేశారు. మరోవైపు బాధితులకు కోటి పరిహారం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.
విశాఖ దుర్ఘటనకు సంస్థ వైఫల్యమే కారణం: మంత్రి బొత్స - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
12 మంది ప్రాణాలు తీసి, ఎంతోమందికి శోకాన్ని మిగిల్చిన గ్యాస్ లీకేజీ ఘటనకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సంస్థ ముక్కుపిండైనా పరిహారం వసూలు చేస్తామని తేల్చి చెప్పారు.
minister botsa