విశాఖ విమానాశ్రయంలో ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండే స్థలాల వద్ద, బయటకు వచ్చే మార్గాల కారిడార్లలోనూ కళారూపాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించడంతోపాటు, పర్యటక సౌరభాన్ని వెదజల్లే విధంగా ఇవి రూపొందించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకించి రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే విధంగా రూపొందించిన కళాకృతులు ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
విశాఖ ఎయిర్ పోర్టులో కనువిందు చేస్తున్న కళాచిత్రాలు - విశాఖ ఎయిర్పోర్టులో కళాఖండలు వార్తలు
విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులను కళాచిత్రాలు కనువిందు చేస్తున్నాయి. విమానాశ్రయ ఆధునీకీకరణలో భాగంగా ఈ కళారూపాలను ఏర్పాటు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం ఆధ్వర్యంలో జానపద కళాకృతులు, చిత్రాలను ప్రతిచోట ఏర్పాటు చేశారు.
విశాఖ ఎయిర్ పోర్టులో కనువిందు చేస్తున్న కళాచిత్రాలు