ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ జిల్లా భూ కబ్జాలకు కేంద్రంగా మారింది: సీపీఎం

ప్రభుత్వ భూములు, పేదలకు అసైన్ చేసిన భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఆక్రమణలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా సీపీఎం నిరసన చేపట్టింది. విశాఖ జిల్లా భూ కబ్జాలకు కేంద్రంగా మారిందని సీపీఎం ఆరోపించింది.

సీపీఎం నిరసన
సీపీఎం నిరసన

By

Published : Jun 19, 2021, 7:58 PM IST

విశాఖ జిల్లా భూ కబ్జాలకు కేంద్రంగా మారిందని సీపీఎం ఆరోపించింది. వేల ఎకరాల ప్రభుత్వ భూములు, పేదలకు అసైన్ చేసిన భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఆక్రమణలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా సీపీఎం నిరసన చేపట్టింది. విశాఖ చుట్టూ ఉన్న 11 మండలాల్లో దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని, వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.

విశాఖలో ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల స్థలాలు ఏపీ స్టేట్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్ పేరిట బదలాయించి దొంగచాటు అమ్మకాలకు తెరలేపడం సిగ్గుచేటన్నారు. రాజకీయ స్వార్థం, కక్షలతో కాకుండా భూఆక్రమణలపై ప్రభుత్వం నిజాయతీగా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... Double murder: అనంతపురం ఆరవేడులో భూతగాదాలు.. అన్నదమ్ముల దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details