లాక్‌డౌన్‌ను హాట్‌స్పాట్ ప్రాంతాలకు పరిమితం చేసి... మిగిలిన చోట్ల దశలవారీగా తొలగించాలని ప్రధాని మోదీని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. బుధవారం ప్రధానమంత్రి దిల్లీ నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ నుంచి విజయసాయిరెడ్డి విశాఖ, అనకాపల్లి ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రానికి 2వేల వెంటిలేటర్లు, లక్ష టెస్టు కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు, నాలుగు వైరాలజీ ల్యాబ్‌లను మంజూరు చేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రోజుకు రూ.60 కోట్ల వరకు రెవెన్యూలోటు వస్తోందని వివరించారు. ఇలా రాష్ట్రంపై రూ.4,500 కోట్ల భారం పడిందని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
లాక్ డౌన్‌ను హాట్‌స్పాట్లకే పరిమితం చేయాలి: విజయసాయిరెడ్డి - ప్రధాని మోదీతో విజయసాయిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ న్యూస్
రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో మినహాయించి.. మిగిలిన చోట్ల దశలవారీగా లాక్ డౌన్ ఎత్తి వేయవచ్చనే అభిప్రాయాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.
'దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయవచ్చని మోదీతో చెప్పాం'
TAGGED:
vijayasaireddy news