స్వదేశానికి పయనమైన యూఎస్ఎస్ ముర్తా నౌక అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా నౌక స్వదేశానికి పయనమైంది. విశాఖలో నాలుగు రోజుల విడిది ముగించుకుని అమెరికాకు బయలుదేరింది. మెరైన్ ఎక్స్‌పిడిషనరీ యూనిట్‌తో కలిసి ఈ నెల 11న విశాఖ వచ్చిన నౌక...భారత నౌక రణ్‌విజయ్‌తో కలిసి బంగాళాఖాతంలో సంయుక్త విన్యాసాల్లో పాల్గొంది. రోమాలు నిక్కబొడుకునేలా యుద్ధ హెలికాఫ్టర్లు,రక్షణ బలగాలతో రెండు నేవీల సిబ్బంది సాహన విన్యాసాలు నిర్వహించారు. అమెరికాకు చెందిన ముర్తా నౌక.. రక్షణ అంశాల్లో ప్రత్యేకించి సముద్ర జలాల్లో శాంతిరక్షణకు సేవలందిస్తోంది. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా సహకారంలో ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య సాగర భద్రత, రక్షణ అంశాల బలోపేతానికి ముర్తా పర్యటన ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని పేర్కొన్నాయి.