దేశవ్యాప్తంగా ఇవాళ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2020 ప్రాథమిక పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199 మంది హాజరు కానున్నారు. వీరికోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం సీశాట్ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్ష మే 31న జరగాల్సిఉండగా కొవిడ్ కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు.
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష - యూపీఎస్సీ సీఎస్ఈ 2020
ఇవాళ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 30, 199 మంది హాజరుకానున్నారు. పరీక్షకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష