ఆత్మస్థైర్యం నింపేందుకు అవగాహన నడక - vishaka
విశాఖ నగరంలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారీగా విద్యార్థులు అవగాహన నడక చేపట్టారు.
నడక
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో సామాజిక విలువల పట్ల అవగాహన కల్పిస్తూ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన నడక చేపట్టారు. బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వద్ద నడకను కళాశాల నిర్వాహకులు భాస్కర్ ప్రారంభించారు. తమ సంస్థలో విద్యనభ్యసించిన 20 వేల మంది విద్యార్థులు రక్షణ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని తెలిపారు.