బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్ టాక్ @ఫన్ బకెట్ భార్గవ్‌కు పోక్సో న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించినట్లు దిశా పోలీసులు వెల్లడించారు. రిమాండ్‌లో ఉన్న భార్గవ్.. ఈ మధ్యనే బెయిలుపై విడుదలయ్యాడు.
"ఫన్ బకెట్" భార్గవ్‌కు మళ్లీ రిమాండ్..
ఫన్ బకెట్ భార్గవ్‌కు పోక్సో న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించింది. బెయిలు నిబంధనలు ఉల్లంఘించడంతో.. కోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీంతో.. పోలీసులు నిందితుడ్ని తిరిగి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
టిక్ టాక్ @ఫన్ బకెట్ భార్గవ్
అయితే.. కేసును ప్రభావితం చేసేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పోస్టులు పెట్టాడని భార్గవ్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బెయిలు నిబంధనలు ఉల్లంఘించాడని పోలీసులు నిందితుడ్ని తిరిగి అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
ఇదీ చదవండి:PRAJA SANKALPA YATRA: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. వైకాపా శ్రేణుల సంబురాలు