ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా జగన్ పాలన ఉందని తెదేపా నేత వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లను... వైకాపా ప్రభుత్వం ఆదుకోకపోగా రోడ్లపైకి ఈడ్చుకెళ్లే దుస్ధితి వచ్చిందని మండిపడ్డారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్ ఇచ్చే విధానం దారుణమని ..అదే గ్రేడింగ్ జగన్ పాలనకు ఇస్తే పదవే కోల్పోతారని విమర్శించారు. ఇసుక రవాణా ఆపేయడం వల్ల 20 లక్షల మంది కూలీలకు అన్నం కరవై..రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాలు అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ కు మూడింతలు చేయాలని చంద్రబాబు ముందే హెచ్చరించారని అనిత ఉద్ఘాటించారు. నాలుగు చోట్ల రాజధానులు అంటే ...నలుగురు ముఖ్యమంత్రులను ఉంచుతారా? నాలుగు సెక్రటేరియేట్ లు కడతారా? అంటూ మాజీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు.
ఏరు దాటాక తెప్ప తగలేసేలా.. జగన్ పాలన: అనిత - ycp
నవరత్నాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదని... కేవలం సీఎం కుర్చీలో కుర్చోవాలనే అత్యాశతో వీలుకాని వాగ్ధానాలు చేసి జగన్ గెలిచాడని తెదేపా మాజీ ఎమ్మెల్యే అనిత విశాఖలో అన్నారు. ఆశావర్కర్లు, ఇసుక విధానం, పోలవరం, రాజధాని అంశాలపై వైకాపా వైఖరికి...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా జగన్ పాలన:అనిత