నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన ఉంది. ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగకముందే.. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన