స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించాలి : లోక్సత్తా
స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని లోకసత్తా పార్టీ నేతృత్వంలో జరిగిన చర్చాకార్యక్రమంలో నిపుణులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో... జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, భాజపా శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక సంస్థలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని లోక్ సత్తా పార్టీ ఆరోపించింది. స్థానిక ప్రభుత్వాల విషయంలో సకాలంలో ఎన్నిక జరిపి... ప్రజలే నేరుగా ఛైర్మన్లను ఎన్నుకునే విధంగా మార్పులు జరగాలని జయప్రకాష్ నారాయణ ఆకాంక్షించారు. విశాఖ పౌర గ్రంథాలయ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల వల్లే నిజమైన ప్రయోజనం ఉంటుందన్న కొణతాల రామకృష్ణ, శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు. తామంతా కలిసి ఒక సమితిగా ఏర్పడి కార్యాచరణ రూపొందించి అమలుకు పోరాటం చేస్తామని ఈ బృంద చర్చలో తీర్మానించారు.