"ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి"
జీవీఎంసీ అధికారులతో మంత్రి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని వారిని ఆదేశించారు.
మంత్రి
జీవీయంసీ పాలనా పరమైన అంశాలపై విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సమీక్ష జరిపారు. పారిశుద్ధ్యం, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విలీన గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. సమీక్ష లో విశాఖ ఎంపీ, నగర పరిధిలోని శాసన సభ్యులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.