విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తన గురువులు స్వరూపానందేంద్ర స్వామికి వేకువజామున కూపి స్నపనం చేయించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. స్వరూపానందేంద్ర స్వామి అనుష్టాన దైవం షణ్ముఖ సుబ్రమణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వరూపానందేంద్ర జన్మదినోత్సవం సందర్భంగా పీఠం ప్రాంగణంలో ఆయుష్య హోమం, ఆవహంతీ హోమం నిర్వహించారు. జన్మదిన మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.
శారదా పీఠాధిపతి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి - స్వాత్మానందేంద్ర స్వామి
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి(minister vellampalli srinivas at saradha peetam), ఇతర అధికారులు హాజరయ్యారు.
శారదా పీఠాధిపతి జన్మదిన వేడుకలు
Last Updated : Nov 8, 2021, 6:40 PM IST