విశాఖ అభివృద్ధి మీద కలెక్టరేట్లో చర్చ జరిగింది. విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం చేతులు మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఒక్క రోజులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జాతీయ రహదారికి భోగాపురాన్ని అనుసంధానం చేస్తూ.. విశాఖ బీచ్ - భీమిలి మీదుగా రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. విశాఖ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.. ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని కాపాడే బాధ్యత అందరిదని చెప్పారు. త్వరలో సింహాచల భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. విశాఖ, విజయనగరం ఇరు జిల్లాల కలెక్టర్లు మాన్సస్ భూములపై సర్వే చేసి నివేదిక ఇచ్చారని.. పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.
మాన్సస్ భూములపై విచారణ జరుగుతోంది: విజయసాయిరెడ్డి