ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుకు మంత్రి అవంతి ఛాలెంజ్.. రాజీనామాకు సిద్ధం!

విశాఖలో కరోనా కేసులు దాస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు. ఆరోపణలు నిరూపించలేకపోతే చంద్రబాబు తన ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ విశాఖ జిల్లాలో 21 కరోనా కేసులు నమోదయ్యాయన్న మంత్రి.. వారిలో 16 మంది కోలుకున్నట్టు చెప్పారు.

Minister avanti srinivas
మంత్రి అవంతి ఛాలెంజ్.. రాజీనామాకు సిద్ధం!

By

Published : Apr 19, 2020, 4:58 PM IST

మంత్రి అవంతి ఛాలెంజ్.. రాజీనామాకు సిద్ధం!

విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ కేసుతో కోవిడ్ బాధితుల 21కి చేరింది. చికిత్స అనంతరం వీరిలో 16 మందికి నెగటివ్ వచ్చినందున.. వారిని డిశ్చార్జ్ చేసినట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పుడు కేవలం జిల్లాలో 5 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. విశాఖలో కేసులు తగ్గించి చూపిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని మంత్రి అన్నారు.

కేసులు దాస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ చేశారు. అలా నిరూపణ చేయకపోతే ప్రతిపక్ష నేత పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. విశాఖలో గత నెల 19న మొదటి కేసు వస్తే... ఈ నెల రోజుల్లో 21 కేసులు వచ్చాయన్నారు. వారిలో చాలా మంది కోలుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 2530 మందికి కరోనా పరీక్షలు చేయగా 2153 మందికి నెగిటివ్ వచ్చిందని, 303 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందనీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details