విశాఖలోని రుషికొండ రిసార్టులను ఆధునికత ఉట్టిపడేలా పునర్నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 92 కోట్లతో రిసార్టులను పునర్నిర్మిస్తున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.
క్రీడలు, ఎన్సీసీ నిధుల అంచనాలపై చర్చించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా కడప జిల్లాలోని ఓ పాఠశాలలో క్రీడ పరికరాలు, శిక్షణ కోసం 3.18 కోట్లు వెచ్చించనున్నట్టు మంత్రి చెప్పారు.