ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VISAKHA STEEL PLANT: ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక, ప్రజాసంఘాల భారీ ర్యాలీ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Massive rally of workers and communities
ప్రజాసంఘాల భారీ ర్యాలీ

By

Published : Jul 11, 2021, 5:38 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని నడిపించి, పార్లమెంట్‌ను స్తంభింపజేయడం ద్వారా ఉక్కు పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ కరోనా రెండో దశలో రాష్ట్రాలకు వందల టన్నుల ఆక్సిజన్‌ను అందించిన విశాఖ ఉక్కు పట్ల కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సహచరులు దేశ సంపదను అదాని, అంబానీలు, బహుళజాతి కంపెనీ పోస్కోకు కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో యువతను ప్రధాని మోసం చేశారన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ‘దిల్లీలో పోరాటాలు చేస్తే పలు పార్టీలు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వాజ్‌పేయి హయాంలో ప్రైవేటీకరణను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపీ ఎర్రన్నాయుడు అడ్డుకున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట సమావేశాల్లో తెదేపా ఎంపీలు కేవలం విశాఖ ఉక్కుపైనే మాట్లాడతారు. వైకాపా ఎంపీలు సైతం చిత్తశుద్ధితో పోరాడాలని’ చెప్పారు. తెదేపా విశాఖ పార్లమెంట నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకెళుతోందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వైకాపా ఎంపీలతో పాటు పార్లమెంటలో పోరాడటానికి తెదేపా ఎంపీలు సిద్ధమన్నారు. వైకాపా ఎంపీలు అవసరమైతే రాజీనామా చేయాలన్నారు. విజయసాయిరెడ్డి ఉక్కును రక్షించి నిబద్ధతను నిరూపించుకోవాలని చెప్పారు.

100వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్షలు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. నగరంలోని జీవీఎంసీ సమీపంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో కూర్మన్నపాలెం కూడలి నుంచి వేలాది మంది కార్మికులతో అక్కడి వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అన్ని రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చిస్తున్నామని, త్వరలోనే దిల్లీ వీధుల్లో ఉద్యమ వేడి పుట్టిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

రోదసిలోకి అడుగు పెడుతున్న తొలి తెలుగు మహిళ

ABOUT THE AUTHOR

...view details