ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GVMC: జీవీఎంసీ నూతన కమిషనర్​గా.. బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ

జీవీఎంసీ నూతన కమిషనర్​గా డాక్టర్ జి.లక్ష్మీశ బాధ్యతలు స్వీకరించారు(lakshmisha take charge as the new GVMC Commissioner news). ఆయనకు.. అధికారులు, జీవీఎంసీ సిబ్బంది స్వాగతం పలికారు.

new GVMC Commissioner
new GVMC Commissioner

By

Published : Oct 30, 2021, 5:18 PM IST

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) నూతన కమిషనర్ గా డాక్టర్ జి.లక్ష్మీశ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు(lakshmisha take charge as the new GVMC Commissioner news). ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ సుందరమైన నగరమని అన్నారు. ఇక్కడ పని చేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్​కు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు, జీవీఎంసీ సిబ్బంది, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పని చేస్తానని వెల్లడించారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details