చెన్నైలాంటి నీటి కష్టాలే... త్వరలోనే మనకు!
ఉత్తరాంధ్ర నీటి పారుదలకు బడ్డెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. తాగు, సాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే... ప్రభుత్వానికి కనబడకపోవటం బాధాకరమని చెప్పారు.
వైకాపా ప్రభుత్వం నీటి పారుదల విషయంలో ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిందని ఉత్తరాంద్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఆరోపించారు. త్వరలో చెన్నైలాంటి నీటి కష్టాలు విశాఖ, విజయనగరం నగరాసు సైతం ఎదుర్కొనబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైవాడ, మేఘాద్రి గెడ్డ లాంటి జలాశయాలు నీరు లేకుండా ఉన్నా... ప్రభుత్వం బడ్జెట్లో సరిగా కేటాయింపు చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వేగవంతంగా పూర్తి చేయాలనీ... పురుషోతపట్నం ద్వారా నీరు అందించాలని కోరారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వల్సినా.. కేవలం 650 కోట్లు ఇస్తే ఏ విధంగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ప్రశ్నించారు.