కాపు నేస్తం, కాపు కార్పొరేషన్ కింద వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం కాపులను తప్పుదోవ పట్టిస్తోందని జనసేన నేత శివశంకర్ ఆరోపించారు. కాపు కార్పొరేషన్తో ఇతర కార్పొరేషన్ల నిధులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంపై వైకాపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మంత్రులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
'కాపు రిజర్వేషన్లు వెంటనే అమలుచేయండి' - కాపు రిజర్వేషన్ వార్తలు
ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం కాపులకు చేసింది ఏమీ లేదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ విమర్శించారు. కాపులకు ఖర్చుపెట్టామని చెబుతున్న నిధులు ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని శివశంకర్ విశాఖలో డిమాండ్ చేశారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసినప్పుడల్లా ఏదో పథకం తెరపైకి తెచ్చి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. గత ప్రభుత్వాలన్నీ రిజర్వేషన్ పేరిట కాపులను మభ్యపెట్టి అధికారం చేపట్టాయన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యను పక్కదోవ పట్టించేవారని శివశంకర్ విమర్శించారు.
ఇదీ చదవండి :జులై కోటా శ్రీవారి దర్శన టికెట్లు రేపు విడుదల