సముద్రంలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న శ్రీలంక మత్స్యకారులను భారత్ కోస్ట్ గార్డ్ రక్షించింది. విశాఖ వైపు వస్తున్న మర్చంట్ నేవీ నౌక ఎం.వి.సుమిత్లోని సిబ్బంది... సముద్రంలో కొంత మంది ప్రమాదంలో ఉన్న విషయాన్ని గుర్తించారు. సమాచారాన్ని కోస్ట్ గార్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కి అందించారు. ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ప్రాణాపాయం నుంచి కాపాడారు. వారిని శ్రీలంకకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని నేవీ అధికారులు తెలిపారు. చెన్నైకి తూర్పుగా 170 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
సముద్రంలో చిక్కుకున్న శ్రీలంక మత్స్యకారులు.. రక్షించిన భారత్ కోస్ట్ గార్డ్ - సముద్రంలో చిక్కుకున్న శ్రీలంక మత్స్యకారులు న్యూస్
సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను భారత్ కోస్ట్ గార్డ్ రక్షించింది. వీరు శ్రీలంక ట్రింకోమలి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో నాలుగు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో బోట్ తలకిందులైంది. అంచులు పట్టుకుని వేలాడడం కనిపించింది.
Indian Coast Guard coordinates rescue operation of six Sri Lankan fishermen