భోజనం బాగా లేదని.. రోడ్డెక్కిన ఏయూ విద్యార్థులు
తమకు పెట్టే ఆహారంలో నాణ్యత లేదని ఆరోపిస్తూ ఏయూ ప్రధాన ద్వారం వద్ద హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అధికారులు నచ్చజెప్పటంతో సమస్య సద్దుమణిగింది.
ఏయూ
వసతులు, భోజన నాణ్యత సరిగా లేదంటూ విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రధాన ప్రవేశ గేటు వద్ద హాస్టల్ విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డుపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యపై విశ్వవిద్యాలయం దృష్టి పెట్టటం లేదని ఆవేదన చెందారు. ఆర్ట్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ యోహాన్ బాబు, విశ్వ విద్యాలయ అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలపై విద్యార్థులు, అధ్యాపకులతో ఒక కమిటీ వేసి పరిష్కరిస్తామని చెప్పటంతో విద్యార్థులు శాంతించారు.