ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నాం''

ప్రజల ఆరోగ్యం కోసం పాటు పడుతున్న తమకు జీతాలు చెల్లించకపోవటం దారుణమని విశాఖ భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్ వాపోయారు. 5 నెలలుగా బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని వారు చేస్తున్న ఆందోళన 5వ రోజుకు చేరుకుంది.

By

Published : Sep 7, 2019, 8:42 PM IST

జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నాం: విశాఖ భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్

జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నాం: విశాఖ భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్

బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్ విశాఖలో చేపట్టిన ఆందోళన.. ఐదో రోజుకు చేరుకుంది. ఐదు నెలల నుంచి జీతాలు లేక తమ కుటుంబాలు పస్తులతో అలమటిస్తున్నా... అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆరు జోన్ లకు చెందిన సుమారు 150 మంది కార్మికులు పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. భూగర్భ డ్రైనేజీ లో వచ్చిన మలమూత్రాలను తమ చేతులతో శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న తమకు అధికారులు జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని వాపోయారు. బకాయి పడ్డ జీతాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details