విశాఖ ఖాతాలో మరో జాతీయ స్థాయి అవార్డు చేరనుంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీని జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. నూతన సంవత్సరంలో మొదటి రోజున ప్రధాని మోదీ చేతుల మీదుగా దీనిని జీవీఎంసీ అధికారులు అందుకోనున్నారు.
పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే కేంద్రప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. 2019కి ముందు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో లబ్దిదారుల జాబితాను ఎంపిక చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారాక పాత లబ్దిదారుల జాబితాని రద్దుచేసి కొత్తగా మళ్లీ దరఖాస్తుల్ని ఆహ్వానించారు. పలు దఫాలుగా దరఖాస్తుల్ని వడపోసి లబ్దిదారుల చివరి జాబితా తీశారు. ఈ మొత్తం ప్రక్రియలో జీవీఎంసీ అధికారులు శ్రమించిన తీరును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా కొనియాడిందని వారు తెలిపారు.
2019-20 సంవత్సరానికిగానూ జీవీఎంసీకి ఈ ఉత్తమ జాతీయ అవార్డు దక్కినట్లు ప్రకటించారు. దేశంలోని మిగిలిన నగరాల్ని వెనక వేసి ఈ ఘనత దక్కించుకోవడంపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు కమిషనర్, ఇతర అదికారులకు అభినందనలు తెలిపినట్లు జీవీఎంసీ పౌరసంబంధాల అధికారి ప్రకటించారు.
ప్రధానితో సమావేశానికి మహిళా కూలీ