మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ సృజన విశాఖలోని తన నివాసంలో పర్యావరణహితంగా దీపావళి జరుపుకున్నారు. స్వచ్ఛ విశాఖ పేరుతో దీపాలను అలంకరించారు. ప్రజలు కాలుష్య రహితంగా పండగ చేసుకోవాలని ఆమె సూచించారు.
మరోవైపు విశాఖ శారదా పీఠంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రాజ శ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతుల సమక్షంలో విశాఖ శారదాపీఠం వేద విద్యార్థులు బాణాసంచా కాల్చారు.