Football Court: క్రీడామైదానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా! ఈ మైదానం మాత్రం మీరనుకున్నట్లు ఉండదు. సరికొత్త రీతిలో ఐదంతస్తుల భవంతిపై దీన్ని ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చేందుకు అంత ఎత్తులో.. ఫైబర్ పచ్చిక, చుట్టూ వలలతో ఏర్పాటు చేసిన ఈ ఆటస్థలం ఎంతగానో ఆకర్షిస్తోంది. విశాఖపట్నంలో వి.ఐ.పి. రోడ్డులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం సహకారంతో ఏర్పాటు చేసినట్లు కోచ్ వై.రమేష్ తెలిపారు. ఇక్కడ కిక్స్ నేర్చుకోవాలంటే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఇచ్చే శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది.
Football Court: కిక్ ఇచ్చే ఐదంతస్తుల "మైదానం".. ఎక్కడో తెలుసా..!
Football Court: క్రీడా మైదానం అంటే నచ్చని వారుండరు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అక్కడికి వెళ్లి ఏదో ఒక ఆట ఆడితే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే సహజంగా మైదానాలు ఎక్కడ ఉంటాయంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది పాఠశాల ప్రాంగణాలు లేదా వేరే ప్రదేశాలో ఉన్న క్రీడా స్థలాలు. కానీ ఇక్కడ ఉన్న మైదానం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీనిని ఓ ఐదంతస్తుల భవనంపై నిర్మించారు. అవునండీ మీరు విన్నది నిజమే.. మరి అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా?
ఐదంతస్తుల భవనంపై ఏర్పాటు చేసిన పుట్బాల్ కోర్టు