కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇంటలెక్చ్యువల్ ప్రోపర్టీ రైట్స్(ఐపీఆర్) చైర్‌ను మంజూరు చేసింది. ఈ స్థానంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఆర్డీసీ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ఐపీఆర్ చైర్‌గా నియమిస్తూ ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ.ప్రసాదరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం తన విధుల్లో చేరారు. ఈ ఐపీఆర్ చైర్ రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికే మంజూరు చేయడం పట్ల వీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఈసీ సభ్యులు డాక్టర్ జేమ్స్ స్టీఫెన్, డీన్ ఆర్అండ్డీ ఆచార్య ఏ.భుజంగరావు పాల్గొన్నారు.
'ఏయూ ఐపీఆర్ చైర్'గా డాక్టర్ హనుమంతు పురుషోత్తం - ఆంధ్ర విశ్వవిద్యాలయం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇంటలెక్చ్యువల్ ప్రోపర్టీ రైట్స్(ఐ.పి.ఆర్) చైర్‌ను మంజూరు చేసింది. ఈ ఐ.పి.ఆర్.చైర్ రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికే మంజూరు చేయడం పట్ల వీసీ అభినందించారు.
ఏయూ ఐ.పి.ఆర్.చైర్‌గా డాక్టర్ హనుమంతు పురుషోత్తం