విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబు... కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయానికి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను అనుమతి లేదని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద నిలువరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు కార్యకర్తలు.
TAGGED:
విశాఖలో చంద్రబాబు