విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేటీఆర్ సైతం..
విశాఖ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీచూడండి:
కరోనా ఒక్కరికొచ్చినా... వారంతా బాధితులే..!