ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రపంచానికి ఏయూ గొప్ప మేధావులను అందించింది' - cm jagan in au

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్​ పాల్గొన్నారు. భవిష్యత్​లో ఏయూ దేశంలోని తొలి 5 స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

'ప్రపంచానికి ఏయూ గొప్ప మేధావులను అందించింది'
'ప్రపంచానికి ఏయూ గొప్ప మేధావులను అందించింది'

By

Published : Dec 13, 2019, 8:24 PM IST

విశాఖలో జరుగుతున్న పూర్వ విద్యార్థుల సదస్సుకు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి​ పాల్గొన్నారు. జీఎంఆర్​ సాయంతో నిర్మిస్తున్న వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిన చరిత్ర ఏయూకి ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరెడ్డిని చూపించారు. దేశంలో ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్న ఏయూ... తొలి 5 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బోధనా సిబ్బంది కొరతతో ఏయూ ముందడుగు వేయలేకపోతుందన్నారు. ఇన్ని స్థానాలు ఖాళీగా ఉండటం ప్రభుత్వం తలదించుకునే అంశమని వ్యాఖ్యానించారు.

'ప్రపంచానికి ఏయూ గొప్ప మేధావులను అందించింది'

ABOUT THE AUTHOR

...view details