రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో... కశ్మీర్లో సరికొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందని కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి అన్నారు. వైబ్రంట్ ఇండియా లక్ష్యాన్ని ప్రధాని మోదీ సాధించారని ఆయన విశాఖలో తెలిపారు. పార్టీ సమావేశానికి హాజరైన ఆయన.. ఈ విషయంపై స్పందించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు విధానాలు అవసరంలేదని స్పష్టం చేశారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆయన... దేశ రక్షణలో భాజపా శ్రేణులు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు.
370 రద్దు కశ్మీర్ నూతన యుగానికి నాంది: కేంద్ర మంత్రి సారంగి
కశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకే అధికరణం 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. విశాఖలో పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
370 రద్దు కశ్మీర్ నూతన యుగానికి నాంది : కేంద్ర సహాయ మంత్రి సారంగి
TAGGED:
370 రద్దు