ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మావోయిస్టుల మందుపాతరలు.. పేల్చేసిన పోలీసులు!

విశాఖ మన్యం పరిధిలోని నుర్మతి లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు పేల్చివేశారు. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

'విశాఖ ఏజెన్సీలో మందుపాతరలను పేల్చిన పోలీసులు'

By

Published : May 30, 2019, 9:55 PM IST

'విశాఖ ఏజెన్సీలో మందుపాతరలను పేల్చిన పోలీసులు'

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు స్థానికంగా కలకలం రేపాయి. నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల సమీపంలో అమర్చి ఉన్న 4 మందుపాతరలను పోలీసులు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. అవకాశం లేదని తేలిన పరిస్థితుల్లో.. ఎస్పీ అట్టాడా బాబూజీ ప్రత్యక్ష సూచనల మేరకు అక్కడే పేల్చేశారు. శబ్దం గట్టిగా రావడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఏం జరిగిందోనని నుర్మతి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులే మందుపాతరలు పేల్చారనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మావోయిస్టుల సానుభూతిపరులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

bombvishakha

ABOUT THE AUTHOR

...view details