విశాఖపట్నం గాయత్రి విద్య పరిషత్ చెందిన సంచాలకులు రావు తటవర్తి తన విద్యార్థి బృందంతో కలిసి ఈ పరికరాన్ని రూపొందించారు. పరీక్ష కోసం ఇటువంటి మానిటరింగ్ అవసరమని భావించారు. ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్ గా దీనిని వ్యవహరిస్తారు. గాలిలో కాలుష్య కారకాలు, సెకండ్ల వ్యవధిలోనే ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని ఈ పరికరం లెక్క పెడుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ అంశంపై స్పందించారు. ఆ పరికరాన్ని, రూపొందించిన రావు సేవలను, వినియోగించు కుంటామని.. తగిన ప్రోత్సాహకము ఇవ్వాలని తెలిపారు. చూడడానికి సీసీ కెమెరా పరిమాణం లో వుండే ఈ పరికరం 360 డిగ్రీలలో తిరుగుతుంది. దీనివల్ల గాల్లో తేమను ఆవిరిని గుర్తించే అవకాశం ఉంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన.. ఈ తరహాలో పరికరం ఉంటే అందులో ఏ మేరకు కాలుష్య కారకాలు ఉన్నాయి, విష పదార్థాల కు సంబంధించిన దాన్ని ఈ పరికరం విశ్లేషణ చేసి వెంటనే సంబంధిత వ్యక్తులను అటెన్షన్ తీసుకుంటుంది.
గాలిలో కాలుష్య కారకాలు కనుగొనే యంత్రం రూపకల్పన
విశాఖ గాయత్రి విద్య పరిషత్ సంచాలకులు ప్రొఫెసర్ రావు రూపొందించిన పరికరం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గాలిలో కాలుష్య కారకాలు, సెకండ్ల వ్యవధిలోనే ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని ఇది లెక్క పెడుతుంది. 'ఓం' గా దీనికి నామకరణం చేశారు. ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్ గా దీనిని వ్యవహరిస్తారు.
air quality check