రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్-2020 ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి.వి.జిడి. ప్రసాదరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. త్వరలో కౌన్సెలింగ్ వివరాలనూ వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఏపీ పీజీఈసెట్-2020 ఫలితాలు విడుదల
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల్లో 85 శాతానికి పైగా అర్హత సాధించినట్లు ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి తెలిపారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఏపీ పీజీఈసెట్-2020 ఫలితాలు విడదల
ప్రవేశ పరీక్షకు 22,911 మంది హాజరుకాగా.. 87.98 శాతం అనగా 20,157 మంది అర్హత సాధించారని ప్రసాదరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 17,150 మంది పరీక్షకు హాజరుకాగా 14,775 మంది అర్హత పొందినట్లు వివరించారు. ఫార్మసీ విభాగంలో హాజరైన 5,761 మందికిగాను 5,382 మంది అర్హత సాధించారని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎన్టీపీసీలో రూ.870కోట్లతో డీసల్ఫరైజేషన్ ప్లాంట్