ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్ర విశ్వవిద్యాలయం చేతికి ఏపీ సెట్​

ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూజీసీ అప్పగించింది. మరో మూడేళ్ల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.

By

Published : Jul 13, 2019, 7:46 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు

ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూజీసీ అప్పగించింది. జాతీయ స్ధాయిలో నెట్, రాష్ట్ర స్ధాయిలో ఏపీ సెట్​లలో ఏదో ఒక పరీక్షను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల కోసం దరఖాస్తు చేసేందుకు తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయి ఉండాలన్న నిబంధనతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఉంటుందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు.

సెప్టెంబరు 12 లోపు అపరాధ రుసుం లేకుండా..

ఆగస్టు ఐదు నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ తరువాత ఐదువేల అపరాధ రుసుంతో దరఖాస్తు స్వీకరణకు తుది గడువు ఉందన్నారు. అక్టోబర్ 20 నుంచి ఎపీ సెట్ పరీక్షలు నిర్వహణ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి :

కార్పొరేట్ సామాజిక బాధ్యతను విస్తరించండి

ABOUT THE AUTHOR

...view details