ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏయూ పీజీ అడ్మిషన్ల గడువు పెంపు

ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యువేషన్ ప్రవేశాలకు మంచి స్పందన వచ్చింది. విద్యార్థుల నుంచి వస్తున్న స్పందనతో సర్టిఫికేట్లు అప్​లోడ్ గడువును 14వ తేదీ వరకు పెంచింది. ఈసారి పూర్తిగా ఆన్​లైన్​లో ప్రవేశాలు విజయవంతంగా నిర్వహించినట్టు అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు.

Andhra university
Andhra university

By

Published : Nov 9, 2020, 6:31 PM IST

Updated : Nov 9, 2020, 6:43 PM IST

కరోనా సమయంలో అసలు తరగతులు జరుగుతాయా లేదా.. అనే భయం అటు తలిదండ్రులు ఇటు విద్యార్థుల్లో ఉండేది. ఇలాంటి తరుణంలో.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొవిడ్ నియమాలు పాటిస్తూ ప్రవేశాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ సెట్ నిర్వహించింది. వర్సిటీలో ప్రవేశాలకు తొలిసారిగా పూర్తి ఆన్​లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. నేటితో ఆ గడువు ముగిసింది. కానీ... విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ నెల 14వ తేదీ వరకు ప్రవేశాలకు గడువు పెంచారు.

ఇప్పటి వరకు సర్టిఫికెట్లు అప్​లోడ్ చేయని వారు కూడా ఇప్పుడు అప్​లోడ్ చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య డి.ఏ. నాయుడు తెలిపారు. ప్రవేశాలకు అవసరమైన పత్రాలు ఇంకా సమకూరలేదనే ఫిర్యాదుతో ఈ సారి ప్రవేశాలను 14వ తేదికి పొడిగిస్తునట్లు ఆచార్య నాయుడు చెప్పారు. 15 నుంచి 18వ తేదీ వరకు వెబ్​ ఆప్షన్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 21న నిర్దేశిత కళాశాల వివరాలు అందించనున్నారు. ఈ నెల 22 నుంచి 24 మధ్యలో ఫీజు చెల్లింపు, 25 నుంచి 26ల మధ్యలో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్​కు వివరాలు అందిచాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి తరగతులు నిర్వహిస్తునట్టు ఆంధ్ర విశ్వ విద్యాలయం అడ్మిషన్ డైరెక్టర్ డి.ఏ నాయుడు చెప్పారు.

గత ఏడాది 20 వేల మంది దరఖాస్తు చేస్తే 8000 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు హాజరయ్యారు. ఈ ఏడాది 16 వేల మంది దరఖాస్తు చేసుకోగా 8500 మంది తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్​లో పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహణ జరుగుతోందని అడ్మిషన్​ డైరక్టర్ తెలిపారు. ఈ ఆన్ లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి సారి నిర్వహిస్తోందని, ఈ విధానం వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియ సులువుగా జరిగిందని చెప్తున్నారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ విద్యార్థులకు, సిబ్బందికి ఇబ్బంది లేకుండా కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లోనూ ఎంసెట్ తరహాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆన్​లైన్ కౌన్సెలింగ్​ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

'సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యే'

Last Updated : Nov 9, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details