ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'స్టీల్ ప్లాంట్ భూములు ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టే యోచన'

By

Published : Sep 18, 2020, 6:42 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్-దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంయుక్తంగా పని చేసేందుకు నిర్ణయించడం, కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్​మెంట్ పేరిట ఈ రెండు సంస్ధలు సంయుక్త భాగస్వామ్యంతో కొత్త కర్మాగారాన్ని పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రెండింటి మధ్య జాయింట్ వర్కింగ్ గ్రూపు కూడా రూపుదిద్దుకుంది. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టే యోచనేనన్నది కార్మిక సంఘాల విమర్శ.

agreement-between-visakha-steel-and-posco
'స్టీల్ ప్లాంట్ భూములను ప్రయివేటు సంస్ధలకు కట్టబెట్టే యోచనే ఇది..!'

విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల పైచిలుకు భూములను కలిగి ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం భూ నిల్వ దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఇప్పటికి సిద్దంగానే ఉంచింది. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టీల్ ప్లాంట్.. కరోనా కారణంగా మరిన్ని చిక్కులను చవిచూస్తోంది. ఈ పరిస్ధితి నుంచి బయటపడేందుకు ఎప్పటినుంచో ఉన్న ప్రతిపాదనకు ఉక్కు మంత్రిత్వ శాఖ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్టీల్ ప్లాంట్

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్ధ గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారం పెట్టేందుకు ఒడిశా ప్రభుత్వంతో దాదాపు ఒప్పందం చేసుకుని ఎనిమిదేళ్లు గడిచింది. ఒడిశాలోని జగత్సింగ్​పూర్​లో 12 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ఉక్కు కర్మాగారం పెట్టేందుకు 52 వేల కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా పోస్కో సంస్ధ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ అందోళనలు జరగడం, పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల 2005లో కుదిరిన ఈ ఒప్పందం 2010 వరకు కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఈ ఒప్పందం రద్దయింది.

తూర్పు ఆసియా మార్కెట్లకు విశాఖ నుంచి ఓడ రేవుద్వారా సరకును పంపేందుకు అవకాశం ఉంటుంది. పోస్కో దృష్టి విశాఖపై పడింది. విశాఖలో ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్​కి ఉన్న భూమి రిజర్వులు పోస్కోతో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఒక అవకాశంగా కన్పించింది. ఈమేరకు రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం గతేడాది కుదిరింది. సంయుక్త వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా ఈ పెట్టుబడి ప్రతిపాదనలను పరిశీలించింది. దాదాపు మూడు వేల ఎకరాల వరకు కొత్త జాయింట్ వెంచర్ కోసం కేటాయించనున్నారు.

అయితే.. విలువైన భూములు ప్రయివేటు సంస్ధలకు కట్టబెట్టేందుకే జాయింట్ వెంచర్​ను తెరపైకి తెచ్చారన్నది కార్మిక సంఘాలు, వామపక్ష సంఘాల వాదన. 16 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్​ విస్తరణకు సరిపడా భూములను తొలుతే సిద్దం చేసుకుని ఉంచారు. ప్రస్తుతం 7.2 మిలియన్ టన్నుల సామర్ద్యంతో ప్లాంట్ నడుస్తోంది.

తాజా ప్రతిపాదనల్లో భారీ వాహనాలకు అవసరమైన స్టీల్​ను ఉత్పత్తి చేయడానికి పోస్కో, విశాఖ స్టీల్ ప్లాంట్ సంయుక్త భాగస్వామ్యంతో కొత్త కర్మాగారాన్ని పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. దీనికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. విధి విధానాలను ఖరారు చేసే పనిలో సంయుక్త వర్కింగ్ గ్రూప్ పనిచేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details