ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROADS: 'వర్షాలవల్లే రోడ్లు పాడయ్యాయ్.. వానలు తగ్గగానే మరమ్మతులు' - bad roads due to rains

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక వర్షాలు అధికంగా కురిశాయని.. అందువల్లే రోడ్లు పాడయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తర్వలోనే వాటికి మరమ్మతులు చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణను గాలికొదిలేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ మండిపడ్డారు.

ROADS
ROADS

By

Published : Sep 6, 2021, 11:21 PM IST

అక్టోబర్ నాటికి టెండర్లు పిలిచి వచ్చే వర్షాకాలం నాటికి రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వర్షాలు ఎక్కువగా కురిశాయని.. అందువల్లే రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడని చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎక్కడో రోడ్లు దెబ్బతింటే దాని గురించి ఎదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,185 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లకు టెండర్లు పిలిస్తే.. 1,816 కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ ద్వారా గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని వేలకోట్లు ఖర్చు చేసి రోడ్లు వేయలేదన్నారు. తెదేపా హయాంలో పంచాయతీ రాజ్ శాఖ తరఫున కేవలం 1,130 కిలోమీటర్లు, పీఎంజీఎస్ వై ద్వారా 330 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని ఆరోపించారు.

వర్షాకాలం పూర్తి కాగానే రోడ్ల మరమ్మతులు చేపడతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల అభివృద్దిని పూర్తిగా గాలికి వదిలేసిందని ఆక్షేపించారు. వర్షాల వలన రోడ్లు దెబ్బతిన్నాయని, రూ. 6వేల కోట్లతో ఎన్ డీబీ ద్వారా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రూ. 2వేల కోట్లకు టెండర్లు పిలిచామని.. అక్టోబర్ తరవాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

'రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రహదారులపై చేసిన ఖర్చు రూ.15కోట్లే'

ABOUT THE AUTHOR

...view details