తెదేపా సహా అనుకూల పార్టీలు రెండు రోజులకో అజెండా తీసుకువచ్చి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు చేస్తోన్న పనులను ప్రచారం చేసుకునేందుకే తమకు సమయం సరిపోవడం లేదన్న ఆయన... రథాలను తగులబెట్టి లబ్ధి పొందాల్సిన అవసరం తమకు లేదన్నారు. దుర్బుద్ధితో కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు సహా ఆయన పార్టీ నాయకులే ఇలాంటి పనులు చేస్తున్నట్లు ఆక్షేపించారు.
రథం దగ్ధం ఘటనలో కుట్ర ఉంది: సజ్జల
అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం ఘటనలో కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సీఎం జగన్కు మంచి పేరు వస్తోందని... పథకాల వివరాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వంపై తెదేపా ఇలాంటి అజెండాలు అమలు చేస్తోందని ఆరోపించారు.
ysrcp leader sajjala comments on chandrababu
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుట్రలు కుతంత్రాలు అందరికీ గుర్తున్నాయన్న సజ్జల...తుని రైలు దగ్ధం, పుష్కరాల తొక్కిసలాట, దళితులపై దాడులు తదితర ఘటనలు చంద్రబాబు చేయించారని ఆరోపించారు. కోర్టుల ద్వారా వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజల్లో జగన్కు మంచి పేరు వస్తుందనే ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. తెదేపా నేతలు తలకిందులు తపస్సు చేసినా ప్రజల్లో సీఎం జగన్కు ఉన్న నమ్మకాన్ని తగ్గించలేరన్నారు.