విజయవాడ సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని కుర్ధుస్ నగర్ లో కిరణ్ అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. ఓ ఇంటి ముందు కూర్చుని ఉన్న దాసు అనే వ్యక్తి తో వాగ్వాదానికి దిగాడు. చాకుతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాసు గాయాలపాలయ్యాడు. దాడి చేసిన కిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గంజాయి మత్తులో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు - విజయవాడ తాజా వార్తలు
విజయవాడలో కిరణ్ అనే వ్యక్తి గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. ఓ ఇంటి ముందు కూర్చుని ఉన్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.
గంజాయి మత్తులో వ్యక్తి పై దాడి చేసిన యువకుడు