ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోండి'

తిరుపతి ఉప ఎన్నికల విషయమై తెదేపా నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. సాహో చంద్రబాబు అనే ఫేస్ బుక్​పేజీలో.. వైకాపాకు ఓటు వేయొద్దని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ycp leaders complaint on tdp to dgp over making false propoganda
'తేదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోండి'

By

Published : Apr 16, 2021, 4:28 PM IST

తిరుపతి ఉప ఎన్నికల విషయంలో సోషల్ మీడియాలో తెదేపా దుష్ప్రచారం చేస్తోందని.. వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్​కు ఫిర్యాదు చేశారు. సాహో చంద్రబాబు అనే ఫేస్​బుక్ పేజీలో.. వైకాపాపై దృష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేష్ స్వీయ పర్యవేక్షణలో.. ఫేస్​బుక్ పేజీ నడుస్తుందని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి సహా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు సెజ్ కోసం భూములు లాక్కుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

సూళ్లూరుపేట, గూడూరు, సత్వవేడు వైకాపా ఎమ్మెల్యేలు.. తమ అనుచరులను వైకాపాకు ఓటు వేయవద్దని.. ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నారా లోకేష్, చంద్రబాబుపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు కోరారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

ABOUT THE AUTHOR

...view details