ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పల్లా శ్రీనివాస్ భవనాన్ని క్షక్షతోనే కూల్చేశారు'

జగన్ సీఎం అయినప్పటి నుంచి బీసీలపై దాడి ప్రారంభించారని తెదేపా సీనియర్ నేతలు యనమల, పుట్టా సుధాకర్ యాదవ్​లు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కబ్జాకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ పోరాడినందుకే కక్షగట్టి ఆయన భవనాన్ని కూల్చేశారన్నారు.

yanamala putta comments on palla house issue
క్షక్షతోనే పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చేశారు

By

Published : Apr 26, 2021, 4:40 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కబ్జాకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ పోరాడినందుకే కక్షగట్టి ఆయన భవనాన్ని కూల్చేశారని తెదేపా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్​లు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులతోనే పల్లా శ్రీనివాస్ కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపట్టారని.., నోటీసులు ఇవ్వకుండా కూల్చటం చట్ట వ్యతిరేకమన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బీసీలపై దాడి ప్రారంభించారని, ఈ దుర్మార్గాల్ని బడుగు, బలహీన వర్గాలు ఖండించి తగు రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు.


ఏ మంత్రిని తొలగిస్తారు: వర్ల రామయ్య
"రామతీర్థ కోదండరామాలయ నిర్వహణ సరిగా లేదని, దేవాలయ ఛైర్మన్​గా అశోక గజపతిరాజును తొలగించారు. ఆక్సిజన్ సరిగా అందక, విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని తొలగిస్తారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణనా ? లేక ఆరోగ్య మంత్రి ఆళ్ల నానినా ?" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.

ఇదీచదవండి: విశాఖలో అలజడి.. తెదేపా నేత పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details