ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు - minister goutham reddy latest news

రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు(Work From Home Town Pilot Project) చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(minister goutham reddy) తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌టౌన్‌ల వల్ల ఐటీ కంపెనీలు, ప్రభుత్వం, ఉద్యోగులకు ప్రయోజనమని కమిటీ పేర్కొంది.

Work From Home Town Pilot Project
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు

By

Published : Sep 30, 2021, 8:52 PM IST

రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు(Work From Home Town Pilot Project) చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇంటి నుంచే పనిచేసుకునే విధంగా ఉద్యోగులకు, కంపెనీలకు వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్రంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌టౌన్‌(Work From Home Town Pilot Project) విధానం అమలుపై ఏర్పాటైన కమిటీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఏపీటీఎస్‌ ఎండీ నందకిశోర్‌, ఐటీ సలహాదారు శ్రీనాథ్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి నేతృత్వంలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. డిమాండ్‌, సర్వే, ఇంటర్నెట్‌, 24 గంటల విద్యుత్‌, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి వసతుల కల్పనపై కమిటీ సమీక్షించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌టౌన్‌ల వల్ల ఐటీ కంపెనీలు, ప్రభుత్వం, ఉద్యోగులకు ప్రయోజనమని కమిటీ పేర్కొంది. వర్క్‌ స్టేషన్లకు అవసరమైన భవనాలను ఇప్పటికే ఏపీఎస్‌ఎన్డీసీ గుర్తించగా..3 దశల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లను నెలకొల్పేందుకు ఐటీశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వాటికయ్యే వ్యయం, స్పేస్‌, ఒక్కో ఉద్యోగి, వర్క్‌ స్టేషన్‌కి అయ్యే ఖర్చులపై ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది.

కాస్ట్‌ టు కాస్ట్‌ విధానంలో వీటిని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీఎస్‌ఎన్డీసీ నెలకొల్పిన ఎక్సలెన్స్‌ సెంటర్లు, ఈఎస్‌సీ సెంటర్లను కోవర్కింగ్‌ స్టేషన్లుగా వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కాకినాడ, విశాఖలోని ఏపీ ఇన్నోవేషన్‌ సెంటర్లు, విలేజ్‌ డిజిటల్‌ సెంటర్లు, ఇంజినీరింగ్‌ కాలేజీలు, కోవర్కింగ్‌ స్టేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లు, వర్కింగ్‌ స్టేషన్లుగా జిల్లాలలోని ఏపీఐఐసీ భవనాలు, ఈఎస్‌సీలను మలుచుకునే దిశగా మ్యాపింగ్‌ చేయాలని మంత్రి మేకపాటి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 14న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details